Logo

పాప పెళ్లి వయసుకల్లా ఒకేసారి చేతికి రూ. 69 లక్షలు.. కేంద్రం గొప్ప స్కీమ్.. నెలకు ఎంత కట్టాలి?

SSY Calculator: సుకన్య సమృద్ధి యోజన.. ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకం. ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ రేటు ఉంది. 15 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్లకు చేతికి భారీ స్థాయిలో రాబడి వస్తుంది. ఏడాదికి కనీసం రూ. 250 నుంచి ఖాతా తెరవొచ్చు. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది పన్ను మినహాయింపును కూడా అందిస్తుంది.

Sukanya Samriddhi Yojana : భారతదేశంలో ఆడపిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యంత ప్రయోజనకరమైన పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తెల ఉన్నత విద్య, వివాహం కోసం దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకం ఆకర్షణీయమైన 8.20 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తోంది. 2025లో ఈ పథకంలో చేరితే, మెచ్యూరిటీ సమయానికి వచ్చే రాబడి ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం!

నెలకు రూ. 5,000 పెట్టుబడి..
  • సంవత్సర పెట్టుబడి: రూ. 5,000 x 12 = రూ. 60,000
  • 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి: రూ. 60,000 x 15 = రూ. 9,00,000
  • అంచనా మెచ్యూరిటీ మొత్తం (8.20% వడ్డీతో): సుమారుగా రూ. 27,71,031
నెలకు రూ. 10,000 పెట్టుబడి..
  • సంవత్సర పెట్టుబడి: రూ. 10,000 x 12 = రూ. 1,20,000
  • 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి: రూ. 1,20,000 x 15 = రూ. 18,00,000
  • అంచనా మెచ్యూరిటీ మొత్తం (8.20% వడ్డీతో): సుమారుగా రూ. 55,42,062
నెలకు రూ. 12,500 పెట్టుబడి (గరిష్ట పరిమితి).
  • సంవత్సర పెట్టుబడి: రూ. 12,500 x 12 = రూ. 1,50,000
  • 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి: రూ. 1,50,000 x 15 = రూ. 22,50,000
  • అంచనా మెచ్యూరిటీ మొత్తం (8.20% వడ్డీతో): సుమారుగా రూ. 69,27,578
  • అంటే గరిష్ట పెట్టుబడితో చూస్తే నెలకు రూ. 12,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీకి దాదాపు రూ. 70 లక్షల వరకు చేతికొస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన కేవలం అధిక వడ్డీ రేటును మాత్రమే కాకుండా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును కూడా అందిస్తుంది. ఇది పాత పన్ను విధానంలో వర్తిస్తుంది. కాబట్టి, మీ కుమార్తె బంగారు భవిష్యత్తు కోసం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top