Logo

పోస్టాఫీస్ గొప్ప పథకం..కేంద్రం హామీతో 2 లక్షలకు 4లక్షలు.. 6 లక్షలకు 12 లక్షలు.. గ్యారెంటీగా రిటర్న్స్.!

Post Office: తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రావాలి డబ్బు కూడా భద్రంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. అసలు అటువంటి స్కీంస్ ఏమైనా ఉన్నాయా..? ఉంటే డబ్బు సురక్షితంగా ఉంటుందా లేదా ..? డబ్బుసేఫ్టీ తోపాటు రాబడి కూడా కావాలంటే ఈ పథకం పర్ఫెక్ట్.. పోస్టాఫీసు అనేది ఓ ప్రభుత్వ సంస్థ, డబ్బుకి రక్షణ ఉంటుంది. అదే సమయంలో మీ డబ్బు 115 నెలలలో రెట్టింపు అవుతుంది. ఆ పథకం పేరు కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ) ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ వస్తుంది. దీని ప్రకారం మీ డబ్బు 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. బ్యాంకులలోని ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఇక్కడే వడ్డీ ఎక్కువగా వస్తోంది.

కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత భవిష్యత్తు కోసం దాచుకోవాలి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు పెట్టుబడులు పెట్టాలి. అలా చేసినప్పుడే ఆర్థిక ఒత్తిడి లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. ప్రస్తుతం పెట్టుబడికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే, చాలా మంది రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. అలాంటి వారికి పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలు మంచి మార్గంగా ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. వీటికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అయితే, తమ లక్ష్యాలకు అనుగుణంగా ఏ పథకం ఎంచుకోవాలి అనేది చాలా కీలకంగా మారుతుంది.

ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ అందించే పథకం కోసం మీరు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన కిసాన్ వికాస్ పత్ర ( Kisan Vikas Patra)ను ఎంచుకోవచ్చు. ఏదైనా పోస్టాఫీసులో ఈ కేవీపీ అకౌంట్ తీసి డిపాజిట్ చేయవచ్చు. కిసాన్ అని పేరు ఉన్నప్పటికీ ఈ పథకంలో భారతీయ పౌరులు ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది పూర్తిగా పోస్టాఫీసులోనే అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి రిస్క్ అనే భయమే ఉండదు. మీ పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీకి పూర్తి హామీ ఉంటుంది. ఎలాంటి నష్ట భయం ఉండదు.

ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ ద్వారా 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఏడాది వడ్డీ పైన వడ్డీ జనరేట్ అవుతూ ఎక్కువ లాభం వస్తుంది. డబ్బు వేగంగా పెరుగుతుంది. ఇందులో మీ పెట్టుబడి ప్రస్తుత వడ్డీ రేటుతో చూసుకుంటే 9 సంవత్సరాల 7 నెలలు అంటే 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. మీరు ఇందులో లక్ష పెడితే దాదాపు 10 ఏళ్ల తర్వాత రూ.2 లక్షలు వస్తాయి. అదే రూ.5 లక్షలు పెడితే మీరు రూ. 10 లక్షలు అందుకుంటారు.

18 సంవత్సరాల వయసు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. మైనర్ల పేరుపై తల్లిదండ్రులు, సంరక్షకులు ఖాతా తెరవవచ్చు. అలాగే ఇద్దరు, ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతానూ తీసుకోవచ్చు. మీ సమీపంలోని పోస్టాఫీసులోకి వెళ్లి కేవీపీ ఫారం నింపాలి. ఆధార్, పాన్ కార్డ్ వంటి కేవైసీ డాక్యుమెంట్లను అందించాల. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో చెల్లించాలి. ఆ తర్వాత మీకు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్ ఇస్తారు. ఇందులో కనీస పెట్టుబడి రూ.1000గా ఉంది. గరిష్ఠంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. నామినీని సైతం ఎంచుకోవచ్చు. అలాగే ఈ పత్రాన్ని తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ సైతం తీసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన 2 సంవత్సరాల 6 నెలల తర్వాత ప్రీ మెచ్యూర్ విత్ డ్రా చేసుకోవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top